రాజమౌళి గొప్పతనం గురించి ముందే తెలుసు.. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే.బాహుబలి,ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి రాజమౌళి.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన విషయం తెలిసిందే.

సినిమా విడుదల ఈ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.

ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి గురించి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి గురించి నాకు అర్థం అయింది అని తెలిపారు ఏఆర్ రెహమాన్.

మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అప్పుడే అర్థమైంది.ఆ తర్వాత రాజమౌళి సినిమాను చూసి ఆశ్చర్యపోయాను.

రాజమౌళి సినిమాలు అన్నీ కూడా తెలుగు సినిమాల కీర్తి ప్రతిష్టలను అంతకంతకు పెంచుతున్నాయి అని ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చారు.

"""/"/ అలా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించాడు ఏఆర్ రెహమాన్.ఇకపోతే ఏఆర్ రెహమాన్ విషయానికి వస్తే.

ఇటీవలే విడుదల అయినా పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంగీతాన్ని అందించారు.కాగా ఈ సినిమా విడుదల ఈ ప్రపంచ వ్యాప్తంగా 475 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో పాటు ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఏఆర్ రెహమాన్.

అంతేకాకుండా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా దూసుకుపోతున్నారు.

గుంపు మేస్త్రి  రంగుపడుద్ది … రెచ్చిపోయిన బీఆర్ఎస్