ఆ సినిమా 300 మందితో పాతిక రోజులు కష్టపడిన ఐశ్వర్యా రాయ్?

దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో సినిమా రాబోతోంది అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కథ, కథనం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటాయి.ఇది ఇలా ఉంటే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా పొన్నియిన్ సెల్వన్‌ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా పార్ట్ 1,పార్ట్ 2 గా రూపొందుతోంది.ఈ సినిమా పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటన సమూహారంగా రూపొందుతుంది.

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.

ఈ సినిమాలో విక్రమ్, కార్తీ జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.కాగా తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.

భారీ చారిత్రక యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారట.

"""/" / ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్‌ చేశారని సమాచారం.

ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు.ఈ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

కాగా ఈ సినిమా సెప్టెంబర్‌ 30న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాకున్న విషయం తెలిసిందే.

ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?