రూ.100 కోట్ల క్లబ్ లో ‘పొన్నియన్ సెల్వన్ 2’.. ఈసారైనా 1000 కోట్లు రాబట్టేనా?
TeluguStop.com
మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం( Director Maniratnam ) డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో అందరికి తెలుసు.
ఎన్నో ఏళ్లుగా తెరకెక్కించాలని అనుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు గత ఏడాది తెరకెక్కించాడు.
కోలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ను గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
ఈ భారీ పాన్ ఇండియా సినిమా 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పార్ట్ 1 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా దాదాపు బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
ఇక పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో మణిరత్నం పార్ట్ 2 ను మరింత వేగంగా పూర్తి చేసాడు.
ఇక పొన్నియన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయ్యింది.
"""/"/
పార్ట్ 2 కూడా మంచి టాక్ రాగా కలెక్షన్స్ పరంగా కూడా రాణిస్తుంది.
పార్ట్ 1 తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ అందుకుంది.అయినా కూడా ఈ సినిమా రెండవ రోజు నుండి మరింత పుంజుకున్నట్టు తెలుస్తుంది.
అందుకే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అప్పుడే 100 కోట్లు( 100Crore Club )కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయినట్టు మేకర్స్ స్వయంగా అనౌన్స్ చేసారు.
"""/"/
ఇక ఈ సినిమాకు పోటీ కూడా లేకపోవడంతో మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
పార్ట్ 1 ను మించి ఈ సినిమా రాణిస్తుందో లేదో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తమిళ్ లో ఇప్పటి వరకు 1000 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు.
దీంతో ఈ సినిమా అంత టార్గెట్ రీచ్ అవుతుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏఆర్ రెహమాన్( AR Rahman ) సంగీతం అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.
ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
చూడాలి మరి పార్ట్ 2 ఎక్కడ ఆగుతుందో.
అనిల్ రావిపూడి సూర్య కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?