ప్లేస్ మార్చేస్తున్న ‘ పొన్నం ‘ ? అసలు కారణం ఇదే
TeluguStop.com
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు ఒక అంచనాకు వచ్చేసారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం మూడు నెలలు సమయం ఉండడంతో, ముందుగానే తాము గెలిచే స్థానాలపై కీలక నాయకులంతా దృష్టి సారించారు.
ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి.బీఆర్ఎస్,( BRS Party ) కాంగ్రెస్ లు సర్వేలు నిర్వహించి అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసుకున్నాయి.
త్వరలోనే వాటిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో ఇంకా ప్రతిస్తంభన కొనసాగుతోంది.
ఇక కాంగ్రెస్ ( Telangana Congress )విషయానికి వస్తే ఆ పార్టీలోని సీనియర్ నేతలు తమ గెలుపుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై అప్పుడే దృష్టి సారించారు.
"""/" /
ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత , కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar )వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే అక్కడ రెండుసార్లు సర్వే చేయించుకున్న పొన్నం.
అక్కడి నియోజకవర్గ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు .ఆ నియోజకవర్గమైతే తను గెలుపునకు డొకా ఉండదని పొన్నం అంచనా వేస్తున్నారు.
ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి ఆయన తీసుకువెళ్లారు.అక్కడ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా పొన్నం అనుచరులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న పొన్నం ప్రభాకర్ అక్కడ జాతీయ నేతలతో సమావేశం అవుతూ, నియోజకవర్గ మార్పుపై చర్చించారని, అక్కడి నుంచి రాగానే నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి తాను పోటీ చేయబోతున్నాననే విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడిస్తారని చెబుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ వెలమ అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
"""/" /
హుస్నాబాద్ నియోజకవర్గంలో( Husnabad ) బీసీల బలం ఎక్కువగా ఉండడంతో, బీసీ నేతగా తాను అక్కడ నుంచి బరిలోకి దిగితే విజయానికి డోకా ఉండదని పొన్నం అంచనా వేస్తున్నారట ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 11% ఓట్లు అధికంగా వచ్చాయని పొన్నం ప్రభాకర్ అభ్యర్థిత్వం పై ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల్లోనూ సానుకూలత వ్యక్తం అవుతున్నట్లుగా తేలడంతో ఆ నియోజకవర్థం నుంచే పోటీ చేయాలని పొన్నం ప్రభాకర్ డిసైడ్ అయిపోయారట.
సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందా..?