ఆ సర్వే పై పొంగులేటి ధీమా ! షరతులు లేకుండా చేరిక అందుకేనా ?

ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అంతకు ముందు ఆయన బిజెపిలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.తమ పార్టీలోకి రావాల్సిందిగా ఈ రెండు పార్టీలు ఆహ్వానించినా,  చాలా కాలం పాటు పొంగులేటి(Ponguleti Srinivasareddy ) వేచి చూసే ధోరణిని అవలంబించారు.

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో, పొంగులేటి తెలంగాణలోనూ ఆ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేశారు.

దీనిలో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిజెపి కాంగ్రెస్ లలో చేరేందుకు పొంగులేటి చాలనే షరతులు అప్పట్లో విధించారు.

"">"/" / ఉమ్మడి ఖమ్మం జిల్లా( Khammam ) వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ, తన అనుచరులకి టికెట్ ఇవ్వాలనే షరతులు విధించారు.

అలా అయితేనే పార్టీలో చేరుతానని కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరిగింది .ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన అనుచరులతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, పార్టీ మారే విషయంలో అందరి అభిప్రాయాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరాలని ఎక్కువమంది పొంగులేటి పై ఒత్తిడి చేశారు.

చివరకు ఆ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని శ్రీనివాసరెడ్డికి వదిలేశారు.కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత , తెలంగాణలో కాంగ్రెస్( Telangan Congress ) అధికారంలోకి వస్తుందని అంచనాతో పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరారు.

అయితే పార్టీలో చేరే ముందు ఎటువంటి షరతులు విధించకుండానే ,కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

దీనికి కారణం కూడా ఉందట.వచ్చే ఎన్నికల్లో సర్వే ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించడంతో, పొంగులేటి సైలెంట్ అయ్యారట.

"">"/" / కాంగ్రెస్ నిర్వహించే సర్వేలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులే గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ అందుతుందని , ఆ ఫలితం తర్వాత ఎలాగూ తన వర్గానికి అసెంబ్లీ సీట్లు దక్కుతాయనే అంచనా తో పొంగులేటి ఉన్నారట.

అందుకే ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.

ఖమ్మం అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా పొంగులేటి అనుచరులు హడావుడి చేస్తున్నారు.

దక్షిణాసియా వ్యాపారవేత్తలే టార్గెట్‌ : కెనడా పోలీసుల అదుపులో ఆరుగురు పంజాబీ యువకులు