సీఎల్పీ నేత భట్టికి పొంగులేటి పరామర్శ…!

నల్లగొండ జిల్లా: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తూ వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరామర్శించారు.

నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలో ఉన్న భట్టిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి,డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య లతో కలిసి పరామర్శించి ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనారోగ్య బారి నుంచి త్వరగా కోలుకొని పాదయాత్రను తిరిగి కొనసాగించాలని ఈ సందర్భంగా పొంగులేటి ఆకాంక్షించారు.

ఫిలింఫేర్ అవార్డులలో సత్తా చాటిన సాయి పల్లవి… స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి మరీ?