మానవ మనుగడకు సవాలుగా మారిన కాలుష్యం!

సరిగ్గా 38 ఏళ్ల క్రితం 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఒక ఫ్యాక్టరీలో నుంచి వెలువడిన విష వాయువులు వేలాది మంది ప్రాణాలను క్షణాలలో బలి గొన్నాయి.

ఈ ఘోర కలిని అందరూ గుర్తుంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా ప్రకటించింది.

1984 డిసెంబర్‌ 2న అర్ధరాత్రి సమయంలో భోపాల్‌ నగరం గాఢ నిద్రలో ఉన్న సమయంలో 41 టన్నుల మిథైల్‌ ఐసోసైనేట్‌ అనే విష వాయువు లీక్‌ కావడం వలన నిమిషాల వ్యవధి లోనే 2259 మంది అమాయక ప్రజలు మరణించారు.

మరో 72 గంటల్లో 3487 మంది అసువులు బాశారు.అనంతరం ఈ దుర్ఘటన వల్ల 8 నుంచి 10 వేల మంది, మొత్తంగా 25,000 మంది ఈ గ్యాస్‌ లీకేజీ వలన ఉత్పన్నమైన పరిణామాలతో మరణించినట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

అంతే కాకుండా పరోక్షంగా 500,000 పైగా ప్రజలు ఈ దుర్ఘటన వలన ఏర్పడిన అనారోగ్యాల బారిన పడ్డారు.

ఇది ప్రపంచం లోనే అతిపెద్ద పారిశ్రామిక కాలుష్య ఘోరకలి.దీని కారణంగా కొందరుఇంకా చికిత్సలు పొందు తూనే ఉన్నారు.

ప్రపంచ విషయానికి వస్తే యునైటెడ్ కింగ్డం చరిత్రలో అత్యంత భయంకరమైన కాలుష్య సంఘటన లండన్ పై డిసెంబరు 4 1952 న ఏర్పడిన మహా స్మోగ్ రూపంలో జరిగింది.

కేవలం 6 రోజులలో 4000 మంది చని పోయారు, తరువాతి మాసాలలో 8000 చని పోయారు.

1979 లో యు ఎస్ ఎస్ ఆర్ లోని స్వేర్ద్ లోవ్స్క్ దగ్గర ఒక బయలాజికల్ ఆయుధాలను తయారు చేసే లాబొరేటరీలో జరిగిన ప్రమాదం లో లీక్ అయిన ఆంత్రాక్స్ స్పోర్ల వలన వందలమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలో నేటి వరకు అతి పెద్ద కాలుష్య ప్రమాదము 1948 సంవత్సరం అక్టోబరు చివర్లో దోనోర, పెనన్ పెనన్ సిల్ వెనియా లో జరిగింది.

దీనివలన మొత్తం 20 మంది మృతిచెందగా 7000 పైగా క్షత గాత్రులయ్యారు.పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వచ్చే వ్యర్థాలు గాలిని, నీటిని, భూమిని, అంతరిక్షాన్ని అన్నింటిని కాలుష్యం చేస్తున్నవి.

కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరిగి పోతున్నది.భూగోళం అగ్నిగోళంగా మారు తోంది.

ప్రస్తుతం ఉన్న రీతిలోనే వాతావరణ కాలుష్యం పెరిగితే ఈ శతాబ్దపు అంతానికి భూ తాపం 3.

5 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగి ప్రళయ విలయాలు సంభవించి జీవుల మనుగడ కష్టమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పరిసరాల కాలుష్యం నేడు మనిషి మనుగడకే ప్రమాదం కలిగించే స్థాయికి చేరుకున్నది.వాయు కాలుష్యములు ఎక్కువగా ఉన్న ప్రపంచ పట్టణాలలోని పిల్లలు ఉబ్బసం, నిమోనియా, ఇతర శ్వాసకోస సంబంధమైన జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ.

"""/"/ వాయు కాలుష్యం సామాన్యముగా జనసాంద్రత అధికంగా కలిగిన మహా నగరాలలో, ముఖ్యముగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ఎక్కడైతే పర్యావరణ నియమ నిబంధనలు అమలులో లేవో లేక నామమాత్రంగా వున్నాయో, అక్కడ కూడు కొంటుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా జన సాంద్రత అధికంగా కలిగిన ప్రదేశాలలో కాలుష్యం అనారోగ్య కరమైన స్థాయిలలో ఉంటుంది.

వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం, ధ్వని కాలుష్యం, సముద్ర కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, వ్యర్థ ఘన పదార్ధాల కాలుష్యం, రేడియో ధార్మిక కాలుష్యం తదితరాలు కూడా కాలుష్య కారకాలు.

పర్యావరణాన్ని రక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు, వివిధ రకాలైన కాలుష్యాలను నియంత్రించటానికి, అదే విధంగా కాలుష్య దు ష్ప్రభావాలను తగ్గించ టానికి వివిధ చట్టాలను అమలు చేస్తున్నాయి.

అదే విధంగా మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య భూతాన్ని తరిమి వేయడానికి పలు చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నాయి.

"""/"/ భారత ప్రభుత్వం 1981వ సంవత్సరంలో వాయు కాలుష్య చట్టాన్ని ప్రవేశపెట్టింది.ఇంకా 1986వ సంవత్సరంలో "పర్యా వరణ పరిరక్షణ చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చింది.

పరిశ్రమల నుంచి వెలువడే పొగ, బూడిద, విష వాయువులు వంటి వాటిని ఫిల్టర్లతో వడపోసి మాత్రమే వాతావరణం లోకి వదలాలి.

అంతేకాక ఇటువంటి పరిశ్రమలను, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణు రియాక్టర్ల వంటి వాటిని జనుల నివాసాలకు దూరంగా కట్టాలి.

రైళ్ళు, వాహనాలు వంటి వాటికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు కాకుండా జీవ ఇంధనాలు వాడేలా చూడాలి.

దీనివలన ఎంతో వాయు కాలుష్యం తగ్గుతుంది.మొత్తం పరిశ్రమలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నాలుగు తరగతులుగా విభజిం చింది.

ఆయా పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాలను అనుసరించి అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లే వాటిని ఎరుపు వర్గంగాను, మధ్యస్తంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నారింజ వర్గంగాను, తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే వాటిని ఆకుపచ్చ వర్గంగా, కాలుష్యానికి ఆస్కారమివ్వని వాటిని తెలుపు వర్గంగా వర్గీకరించింది.

తెలంగాణ లోని పరిశ్రమలన్నింటినీ కాలుష్య నియంత్రణ మండలి క్రమబద్ధంగా పర్యవేక్షిస్తోంది.ఈ పరిశ్రమలు ఎటువంటి కాలుష్యాన్ని విడుదల చేయకుండా చూస్తూ, ఒక వేళ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలకు ఉపక్రమిస్తున్నది.

అలాగే అడవులను, పర్యావరణాన్ని రక్షించేందుకు ఇతర చర్యలతో పాటు, అతి ముఖ్యమైన తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికపై కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నది.

జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టే మునగాకు షాంపూ.. ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?