తెలంగాణలోనూ మొదలైన పోలింగ్ .. ఇక్కడి పరిస్థితి ఏంటంటే ? 

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోనూ పోలింగ్( Telangana ) ప్రక్రియ ఉదయం నుంచి మొదలైంది.

తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు.

సినీ రాజకీయ ప్రముఖులు సైతం క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే మొదలైంది.ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ప్రక్రియను పరిమితం చేశారు .

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చశారు.

"""/" / ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 నిమిషాల నుంచి 6.

30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు.

ఆ తరువాత పోలింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు.తెలంగాణ వ్యాప్తంగా 5,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

90 శాతం కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పదివేల పోలింగ్ స్టేషన్లను( Polling Stations) సమస్యాత్మకంగా గుర్తించారు.

ఈ ఎన్నికల్లో రెండు లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.వీరిలో 12,909 మంది సెక్టార్,  రూట్ అధికారులు, 3,522 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 1200 మంది, మానిటరింగ్ అధికారులు 200 మంది ఉన్నారు.

"""/" / ఎన్నికల బందోబస్తు( Elections Arrangement) నిమిత్తం 72,000 మంది పోలీసులను ఉపయోగించుకుంటున్నారు.

తెలంగాణలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు.దీంట్లో స్త్రీలు 1,67,01,192  ఉండగా, పురుషులు 1,65,28,366 మంది ఉన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాతో ప్రధాన పార్టీలు ఉన్నాయి.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి , ఎంఐఎం లు ప్రధానంగా పోటీ పడుతున్నాయి.తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి .

నేటితో ఈ పోలింగ్ ప్రక్రియ ముగియనుండడంతో, మళ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

ఆస్కార్‌ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’