లోక్‎సభ ఆరో విడత ఎన్నికల పోలింగ్..!

దేశంలో లోక్‎సభ ఆరో విడత ఎన్నికల పోలింగ్( Loksabha Sixth Phase Polling ) కొనసాగుతోంది.

ఆరో విడతలో భాగంగా 58 లోక్‎సభ మరియు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్( Polling ) సాగుతోంది.

ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఢిల్లీ,( Delhi ) హర్యానా,( Haryana ) బీహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, ఒడిశా, యూపీ మరియు పశ్చిమ బెంగాల్ లో లోక్‎సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సాగుతోంది.కాగా ఆరో విడతలో మొత్తం పదకొండు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.