దేశంలో రేపు లోక్‎సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్

దేశంలో రేపు లోక్‎సభ ఎన్నికలకు (Lok Sabha Elections )ఆరో విడత పోలింగ్ జరగనుంది.

ఈ మేరకు పోలింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది.

ఆరో విడతలో 58 లోక్‎సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో ఎనిమిది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది.

ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, ఒడిశా, యూపీ మరియు పశ్చిమ బెంగాల్ లో లోక్‎సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఇక ఒడిశాలో 42(Odisha) అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

వాలంటీర్ల కు కోతలు మొదలు… ఆ విధులు వీరికి అప్పగింత