నరసరావుపేట ఎంపీ స్థానంలో వెల్లువెత్తిన పోలింగ్.. ఏపీ సీఈవో గణంకాలు
TeluguStop.com
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి( AP CEO ) కార్యాలయం కీలక విషయాన్ని తెలిపింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానంలో( Narasaraopeta Parliament ) పోలింగ్ శాతం భారీగా నమోదు అయిందని తెలిపింది.
ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో సుమారు 85.
65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం పేర్కొంది.1967 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా.
ఈ సారే అత్యధికంగా పోలింగ్ శాతం వచ్చిందని తెలిపింది.నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
అలాగే ఎంపీ నియోజకవర్గ పరిధిలో( MP Constituency ) మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉండగా.
వీరిలో 14,85,909 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది.
వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి