జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా జరిగింది.

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.సాయంత్రం 05.

00 గంటల వరకూ సిరిసిల్ల నియోజకవర్గంలో 73.42 శాతం , వేములవాడ నియోజకవర్గంలో 70.

17 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ స్టేషన్ల క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎం లను తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన రిసెప్షన్ సెంటర్ కు తరలించి అక్కడ ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములో భద్రపరచనున్నారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్, పరిశీలకులు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు.

కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.

మణిగండసామి లు పరిశీలించారు.పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్.

పోలింగ్ సరళిని ఎప్పటి కప్పుడు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మానిటరింగ్ చేశారు.

రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ అధికారులతో ఎప్పటి కప్పుడు మాట్లాడుతూ.క్షేత్ర స్థాయిలో పోలింగ్ సజావుగా జరిగేలా మార్గదర్శనం చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో పాటు అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం 159 లో పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వేములవాడ లోని చింతల టానా, నాంపల్లి లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెన్న‌లా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!