సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్..!

తెలంగాణలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.ఈ మేరకు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కంప్లీట్ అయింది.

ఈ క్రమంలో ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.

సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పినపాక, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంథని, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలంలో పోలింగ్ ముగిసింది.

అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ పోలింగ్ మందకొడిగా సాగుతున్న సంగతి తెలిసిందే.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?