కేసీఆర్‎వి దిగజారుడు రాజకీయాలు..: మాజీమంత్రి జూపల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.అవినీతి, అక్రమాలతో కేసీఆర్ రూ.

వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని జూపల్లి విమర్శించారు.

ఈ క్రమంలో అధికార పార్టీలోకి వెళ్లిన వాళ్లు అమ్ముడుపోతున్నట్లేనని పేర్కొన్నారు.అమ్ముడుపోయిన నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానీయొద్దని సూచించారు.

ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందన్న జూపల్లి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని వెల్లడించారు.

ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.. ఇప్పటి తరానికి తెలియని విషయాలు