రాజకీయం అంటే మరణించినా ప్రజల గుండెల్లో బతకడం..: సీఎం జగన్

ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహా ప్రవేశాల అనంతరం ఆయన మాట్లాడారు.గతంలోని టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా పేదలను పట్టించుకుందా అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు.

పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారన్న సీఎం జగన్ పేదవాడికి చంద్రబాబు సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు.

చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు సెంటు స్థలం ఇవ్వలేదని విమర్శించారు.

చంద్రబాబుతో పాటు ఆయనను సమర్థించే వాళ్లకు కూడా ఏపీపై ప్రేమ లేదని చెప్పారు.

అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ చిరునామా పక్క రాష్ట్రంలో ఉందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.

దత్తపుత్రుడి ఇల్లాలు మూడేళ్లకు, నాలుగేళ్లకు మారుతున్నారన్న సీఎం జగన్ నేతలుగా మనం వివాహ వ్యవస్థను, మహిళలను గౌరవించకపోతే ఎలా అని ప్రశ్నించారు.

సినిమా షూటింగ్ ల మధ్య విరామంలో పవన్ కల్యాణ్ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు.

రాజకీయం అంటే మరణించినా ప్రజల గుండెల్లో బతకడమని తెలిపారు.52 నెలలుగా ఏపీలో ఎక్కడా చూసినా అభివృద్ధే కనిపిస్తోందని పేర్కొన్నారు.

మీకు ఇంటిలో మంచి జరిగి ఉంటేనే తనకు సైనికులుగా రావాలని సీఎం జగన్ కోరారు.

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల అందరి చూపు ప్రభాస్ వైపే.. దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ !