హుజూరాబాద్ వేదికగా హీటెక్కుతున్న రాజకీయం... గందరగోళంలో టీఆర్ఎస్

మామూలుగా రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రాజకీయాలు హీటెక్కుతున్నట్లు మనకు కనిపిస్తాయి.కాని ఇక్కడ విషయం పూర్తి రివర్స్ గా ఉన్న పరిస్థితి ఉంది.

ఇప్పట్లో హుజురాబాద్ కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు.కాని టీఆర్ఎస్ మాత్రం మాత్రం ఒక్కసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇంచార్జిలను నియమించి అసలేం జరుగుతుందో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే వేరే నియోజకవర్గం కు చెందిన ఎమ్మెల్యేలు సైతం వారికి కేటాయించిన మండలంపై దృష్టి సారించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేమిటంటే ఈటెల వేస్తున్న వ్యూహాలతో టీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

హుజూరాబాద్ లో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈటెల వెంట నడుస్తూ టీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్న పరిస్థితి ఉంది.

ఇదే తరహా పరిస్థితి కొనసాగితే టీఆర్ఎస్ కు కంచుకోట అయిన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

"""/"/ ఏది ఏమైనా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ చతికిల పడితే టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ అయ్యేలా కనిపిస్తోంది.

  హుజూరాబాద్ లో భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

పవన్ కోసం రేణు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పుకుందా ? బద్రి సినిమా తర్వాత ఏం జరిగింది ?