రేవంత్ ఈటెల కలయికపై పొలిటికల్ వార్...

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది.

నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇటీవల పార్టీ ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన తరుణంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కెటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి విశ్లేషిస్తే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని ఓ ప్రముఖ రిసార్ట్ లో రేవంత్ ఈటెల రహస్యంగా కలుసుకున్నారని నా వ్యాఖ్యలు అబద్దమని నిరూపించగలరా కావాలంటే ఫోటోలు కూడా విడుదల చేస్తాను అంటూ కెటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఒకింత చర్చ జరిగిందంటే ఇక పరిస్థితి అర్థమ చేసుకోవచ్చు.

ఇక ఇప్పుడు రేవంత్ ,ఈటెల కలయికపై ఇటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పెద్ద ఎత్తున సాగుతోంది.

నేను ఈటెలను కలసిన విషయం వాస్తవమే కానీ నీలాగా చీకట్లో కలవలేదని  అంటూ రేవంత్ కెటీఆర్ పై సెటైర్ లు వేసిన పరిస్థితి ఉంది.

అయితే ఈటెల కూడా రేవంత్ ను నేను కలిసిన మాట వాస్తవమే కానీ ఇప్పట్లో కలవలేదని ఎప్పుడో కలిసిన విషయాన్ని ఓటమి భయంతో ఇప్పుడు జరిగినట్టు ప్రజలను నమ్మించాలనుకోవడాన్ని చూస్తుంటే ఓటమిని ఎన్నికల ఫలితాల కంటే ముందే ఒప్పుకుంటుంటున్నదని అర్థమవుతోందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ పొలిటికల్ వార్ ఇంకెన్ని సంచలన కామెంట్లకు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.

అంతేకాక హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను మరింత వేడెక్కించే పరిస్థితి ఉంది.

మరి ఈ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో ఈసీ నిర్ణయం..విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు..!