తెలంగాణలో బీజేపీ అవలంబిస్తున్న రాజకీయ విధానం ఇదే

తెలంగాణలో బీజేపీ తనదైన శైలిలో దూసుకపోతోంది.టీఆర్ఎస్ ను అనేక విషయాలలో ఇరుకున పెడుతూ, ప్రజల్లో సాధ్యమైనంత వరకు సత్తా నిలుపుకొనేలా వ్యూహాలు రచిస్తోంది.

ఒకవైపు టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటూనే రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది.

టీఆర్ఎస్ తరువాత ఓటు ఎవరికి వేయాలి అనే సందేహం రాకుండా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పడేలా క్షేత్ర స్థాయి వ్యూహాలను రచిస్తోంది.

త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండడంతో ఈ వ్యూహాలను బీజేపీ అమలు చేయనుంది.

క్షేత్ర స్థాయి కార్యకర్తల నిర్మాణాన్ని పటిష్టంగా చేపడుతూ ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఏది ఏమైనా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయని సరికొత్త రాజకీయాన్ని బీజేపీ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఏది ఏమైనా ఇప్పటి నుండి కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా సమీక్షించి తీసుకునే అవకాశం ఉంది.

అదే విధంగా పార్టీని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి మళ్ళీ ఇంకాస్త బలంగా తీసుకెళ్లేలా వ్యూహాలు రచించే అవకాశం లేకపోలేదు.

సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా