తస్సదియ్య ..  ఎక్కడ చూసినా దొంగ ఫంక్షన్లే 

ఇప్పుడు అసలే ఇది ఎన్నికల కాలం కావడంతో,  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, రాజకీయ వాతావరణమే కనిపిస్తుంది .

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండడంతో , అన్ని రాజకీయ పార్టీలు( Political Parties ) ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి.

తమ చుట్టూ ఉండే మంది మార్బలానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ,  విందులు , వినోదాలు ఏర్పాటు చేస్తున్నాయి.

అలాగే కుల సంఘాల ద్వారా తమ కు మద్దతు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి.

అయితే ఎన్నికల కమిషన్( Election Commission ) అలర్ట్ గా ఉండడం , ప్రతి రూపాయి ఖర్చు ను అభ్యర్థుల ఖాతాల్లో లెక్కలు వేయడం తదితర కారణాలతో ఎన్నికల కమిషన్ కళ్ళు కప్పేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్( Election Code ) నుంచి తప్పించుకునేందుకు కార్యకర్తలతో సమావేశాలు , కుల సంఘాలతో సభలు , ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

"""/" / దీనిలో భాగంగానే వారందరినీ ఒకచోటకి చేర్చి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

అయితే ఇదంతా ఎన్నికల కోడ్ లోకి వస్తుండడం తో ఫంక్షన్ల పేరుతో వారందరినీ ఒకచోటకు చేర్చి, తాము చెప్పాలనుకున్నది చెప్పి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందుకే దొంగ ఫంక్షన్లను భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఏర్పాటు చేస్తూ,  ఓటర్ల మద్దతు( Voters Support ) పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలింగ్ కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడంతో , ముందుగానే పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి.

  ఎన్నికల కమిషన్ కూడా అన్ని కార్యక్రమాల పైన నిఘా పెట్టడంతో , దొంగ ఫంక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు.

కార్యకర్తలలో ఎవరో ఒకరిది పుట్టినరోజు పేరు చెప్పి భారీగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు .

"""/" / అలాగే అమ్మవారి గుళ్ళ వద్ద మొక్కుల పేరుతో భోజనాలు,  గుడుల వద్ద అన్నదానాలను ఏర్పాటు చేస్తూ , ఎన్నికల కోడ్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు.

పైకి ఫంక్షన్ పేరుతో హడావుడి కనిపించినా,  లోపల మాత్రం పార్టీ కార్యకర్తలు జనాలతో సమావేశం ఏర్పాటు చేసి,  తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

  ఇక కుల సంఘాల మీటింగ్ లు ఇదేవిధంగా సాగుతున్నాయి.ఆయా పార్టీల అభ్యర్థులు ఈ రకమైన ఎత్తుగడ కు తెరతీయడంతో,  ఎన్నికల కమిషన్ కూడా వీటిపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ సృష్టించిన కల్కి సినిమా…