ఆ 19 స్థానాల్లో టికెట్లు ఆశిస్తుంది వీరే ! రేవంత్ కు ఇబ్బందే ?

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) జెండా ఎగురుతుందనే నమ్మకంతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

ఇప్పటికే రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.మొదటి జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించగా,  రెండో జాబితాలో 45 మంది పేర్లను ప్రకటించింది.

ఇంకా 19 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించే విషయంలో తర్జన భర్జన పడుతోంది.ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకోవడంతో ఆచితూచి అభ్యర్థుల ప్రకటన చేయాలని నిర్ణయించుకుంది.

అయితే మిగిలిన 19 నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో  ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఈ మేరకు 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇప్పటికే ప్రకటించిన 100 స్థానాల్లో టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలో వారిని బుజ్జగించే ప్రక్రియకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇది ఇలా ఉంటే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్( DK Siva Kumar ) కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలను పర్యవేక్షించబోతున్న నేపథ్యంలో , మిగిలిన పంతొమ్మిది స్థానాల విషయంలోనూ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మిగిలిన 19 నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు తమకే కేటాయించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో పాటు అధిష్టానం పెద్దల వద్ద ఒత్తిడి పెంచారు.

దీంతో ఈ వ్యవహారం తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది.

ఇంకా టికెట్ ప్రకటించాల్సి ఉన్న 19 నియోజకవర్గాల్లో ప్రధానంగా టికెట్ కోసం పోటీపడుతున్న అభ్యర్థుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.

"""/" / సూర్యాపేట :  దామోదర్ రెడ్డి/ పటేల్ రమేష్ రెడ్డి తుంగతుర్తి : అద్దంకి దయాకర్ /డాక్టర్ వడ్డేపల్లి రవి మిర్యాలగూడ :  సిపిఎం( CPM ) చెన్నూరు : సిపిఐ( CPI ) చార్మినార్ : అలీ మస్కతి నిజామాబాద్ అర్బన్ : ధర్మపురి సంజయ్ /మహేష్ కుమార్ గౌడ్/ షబ్బీర్ అలీ కామారెడ్డి : రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది """/" / సిరిసిల్ల : ఉత్తంకుమార్ రెడ్డి,( Uttam Kumar Reddy ) వైరా : సిపిఎం కు కేటాయించే అవకాశం కొత్తగూడెం : సిపిఐ బాన్సువాడ : కాసుల బాలరాజు గౌడ్ / ఏనుగు రవీందర్ రెడ్డి జుక్కల్ :గంగారం /తోట లక్ష్మీకాంతరావు పటాన్ చెరువు : నీలం మధు /కాటా శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ : సంతోష్ కుమార్/ పురమల్ల శ్రీనివాస్ /కొత్త జైపాల్ రెడ్డి ఇల్లందు : కోరం కనకయ్య శంకర్ నాయక్ / డాక్టర్ రవి డోర్నకల్ : రామ్ చంద్ర నాయక్( Ram Chandra Naik ) సత్తుపల్లి : మట్టా రగమయి/ మానవతా రాయ్ నారాయణఖేడ్ : సురేష్ షేట్కర్ , సంజీవ్ రెడ్డి అశ్వరావుపేట :  తాటి వెంకటేశ్వర్లు / జారే ఆదినారాయణ.

ఆస్ట్రేలియా: క్లీనింగ్ జాబ్స్ చేస్తూ కోటీశ్వరుడైన శ్రీలంకన్ వర్కర్..?