నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి విషయంపై తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.
ఏ మాత్రం తొందరపడినా ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.ఎవరితోనైనా సరే కోపంగా ఉన్నా,స్నేహంగా ఉన్నా ముందు చూపుతో మెలిగితేనే ఫలితం కనిపిస్తుంది.
ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఏ కామెంట్ చేసినా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యే ప్రమాదం పొంచి ఉంది.
దీనితో మామూలుగా ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ పొరపాటున నోరుజారితే రికార్డు చేసి ట్రోల్ చేసేందుకు ప్రత్యర్థులు చెరవాణి అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకొని నిమిషాల వ్యవధిలోనే చక్కర్లు కొట్టించేందుకు సిద్ధంగా ఉంటారు.
అందుకేనేమో బేరసారాలు మాట్లాడేందుకు సాధారణ కాల్ చేసేందుకు నేతలు జంకుతున్నారు.ఎక్కడ రికార్డు చేసి తమకున్న రికార్డును చెడగొడతారో, ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తెగ భయపడిపోతున్నారు.
ఎందుకొచ్చిన తంటా అంటూ సేఫ్ జోన్లో ఉండేందుకు ఈ మధ్యన పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు వాట్సప్‌లోని వాయిస్ కాల్‌తో అధికంగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది.
అలా మాట్లాడితే కాల్ రికార్డు చేసే అవకాశం ఉండదనే ఆలోచనతో ఆ విధంగా మాట్లాడేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
పేకాట మత్తులో నటుడు…. రాజీవ్ కనకాల వద్ద రూ.350 కోట్లు అప్పు చేశారా?