వైసీపీలో కాక మొద‌లైంది… ఆ నేత‌ను ఒంట‌రి చేస్తోందెవ‌రు ?

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు మంచి కాక మీదున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

యువ నాయ‌కుడు అనూహ్యంగా టికెట్ ద‌క్కించుకుని గెలుపు గుర్రం కూడా ఎక్కిన వెంక‌టే గౌడ‌.

ఇక్క‌డ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెబుతున్నారు.గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందువెంక‌ట్ అనే వ్య‌క్తి.

పెద్ద‌గాఎవ‌రికీ తెలియ‌దు.అయితే ప్ర‌స్తుత మంత్రి పెద్దిరామ‌చంద్రారెడ్డి ఆయ‌న‌ను తీసుకువ‌చ్చి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాట్లాడి టికెట్ ఇప్పించారు.

మాజీ వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి టీడీపీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డిపై పోటీ చేసిన వెంక‌టే గౌడ విజ‌యం ఒక రికార్డు.

ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప‌రిచ‌యం కూడా లేని వెంక‌టే గౌడ ఏకంగా 32 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

అయితే విన‌యానికి ఆయ‌న మారు పేరుగా మారారు.పార్టీలో త‌న‌ను పెంచి పోషించిన మంత్రి పెద్దిరెడ్డి అంటే ఆయ‌న‌కు ఎన‌లేని గౌర‌వం.

అదేస‌మ‌యంలో పార్టీప‌ట్ల కూడా విధేయుడు.జ‌గ‌న్ అంటే.

అపార‌మైన గౌరవం.అయితే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వెంక‌టే గౌడ‌.

ఎక్కువ‌గా బెంగ‌ళూరులోనే ఉంటున్నారు.ఇదిలావుంటే నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పేరుతో కొన్ని వ‌సూళ్లు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ధానంగా వైసీపీ వ్య‌తిరేక మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.దీంతో ఆయ‌న అలెర్ట్ అయ్యారు.

ఈ వార్త‌లు వాస్త‌వాలు కాద‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.అయిన‌ప్ప‌టికీ  కొన్ని రోజుల త‌ర్వాత మ‌ళ్లీ స్టోరీ రిపీట్ అయింది.

"""/"/ దీంతో చిర్రెత్తుకొచ్చిన వెంక‌టే గౌడ‌.దీని వెనుక మాజీ మంత్రి ఉన్నారంటూ.

నేరుగా విమ‌ర్శల ప‌ర్వం కొన‌సాగించారు.అయితే దీనికి కౌంట‌ర్‌గా.

అమ‌ర్‌నాథ్‌రెడ్డి కూడా వీధికెక్కారు.త‌న‌కు ఆ అవ‌స‌రం లేద‌ని.

నీ పార్టీలోనే నిన్ను ఒంట‌రిని చేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.ఆయ‌న ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు కావాలంటే రుజువు చేస్తానంటూ స‌వాల్ చేశారు.

మొత్తానికి ఇది ముగిసింది.అయితే ఇప్పుడు వెంక‌టే గౌడ అంత‌ర్మ‌థ‌నంలో కూరుకుపోయారు.

త‌న‌ను త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఒంట‌రి చేసేందుకు ఎవ‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే విష‌యం ఆయ‌న‌కు అంతు చిక్క‌డం లేదు.

అయితే.కొంద‌రు వైసీపీ కీల‌క నాయ‌కులు ఎమ్మెల్యేల నుంచి వ‌సూళ్లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో వెంక‌టే గౌడ విష‌యంలో ఎవ‌రూ అడ‌గ‌డం లేదు.దీనికి మొహ‌మాటం అడ్డం వ‌చ్చి కావొచ్చు.

కానీ, వెంక‌టే గౌడ త‌నంత‌ట తాను తెలుసుకుని ఇవ్వ‌డ‌మూ లేదు.దీంతో కీల‌క పెద్దల ప‌నేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కీల‌క నేత లేకుండా ఇంత విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.మ‌రి.

ఈ గూడు పుఠానీని వెంక‌టే గౌడ ఎలా ఛేదిస్తారో చూడాలి.

గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!