రసవత్తరంగా మారిన వైరా రాజకీయం..!
TeluguStop.com

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం రాజుకుందని తెలుస్తోంది.


మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయని సమాచారం.


ఈ క్రమంలో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గంపై మదన్ లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
వైరా బీఆర్ఎస్ టికెట్ మదన్ లాల్ కు వస్తుందని తట్టుకోలేక ఫొటోలు మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.
దీంతో వైరా నియోజకవర్గ రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్.. ఆ తప్పులు చేయనంటూ?