Pithapuram SVSN Varma : పిఠాపురంలో రాజకీయ వేడి.. స్వతంత్ర అభ్యర్థిగా వర్మ పోటీ..!!
TeluguStop.com
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.
టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ( SVSN Varma ) పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు.వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా( Independent Candidate ) పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
"""/" /
కార్యకర్తల నిర్ణయం మేరకు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వర్మ వర్గీయులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా వర్మ బరిలో దిగితే నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ పై పోటీకి బలమైన అభ్యర్థిగా వర్మ పోటీ చేసే అవకాశం ఉంది.
మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!