ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్
TeluguStop.com
ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది.ఓ అధికార పార్టీ బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో పాలిటిక్స్ మరింతగా హీటెక్కుతున్నాయి.
కాంగ్రెస్ నేతలు ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గాను భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ సభకు అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానుండగా ఆయన సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వంటి ప్రముఖ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఈ సభా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ఇవాళ జిల్లాకు రానున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది.ఈ క్రమంలో ఇవాళ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లు లబ్దిదారులకు పట్టాలను అందించనున్నారు.
అనంతరం మమతా మెడికల్ కాలేజీని మంత్రులు సందర్శించే అవకాశం ఉంది.అయితే జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, కార్యక్రమాలతో తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మం రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది.
రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!