సోము ప్లాప్ పాలిటిక్స్‌పై బీజేపీలో గుస‌గుస‌లు…!

ఏపీ బీజేపీకి చాలా ల‌క్ష్యాలు ఉన్నాయి.పార్టీ పుంజుకోవ‌డం ప్ర‌ధాన ల‌క్ష్య‌మైతే.

పార్టీలోనే ఉంటూ నిర్లిప్త ‌త‌గా వ్య‌వ‌హ‌రించేవారిని పార్టీవైపు తిప్పుకోవ‌డం, మ‌రీ ముఖ్యంగా త‌న‌వైపు తిప్పుకోవ‌డం అనేది ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజుకు పొలిటిక‌ల్ సంక‌టంగా మారిపోయింది.

గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీనా రాయ‌ణ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు.గ్రూపుల‌ను ఆయ‌న వ‌ద్ద‌నేవారు.

ఏదైనా స‌మ‌స్య ఉంటే.త‌న‌కు నేరుగా చెప్పాల‌ని ఫోన్లు చేసేవారు.

దీంతో పెద్ద‌గా ఆయ‌న గురించి నేత‌లు ఎక్క‌డా గ్రూపు రాజ‌కీయాలు చేయ‌లేదు.కానీ, సోము ప‌గ్గాలు చేప‌ట్టాక‌.

ఈ గ్రూపుల గోల పెరిగిపోయింది.ఆది నుంచి పార్టీలో ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌త్యేకంగా గ్రూపుగా ఉండేది.

H3 Class=subheader-styleక‌న్నా /h3pఈ విష‌యాన్ని గుర్తించి  ప్ర‌తి విష‌యాన్ని వారితో షేర్ చేసుకు నేవారు.

జిల్లాల్లో వారికి కొన్ని బాధ్య‌త‌లు కూడా ఇచ్చేవారు.జిల్లాల ప‌ర్య‌ట‌నలు చేసిన‌ప్పుడు వారిని వెం ట‌బెట్టుకుని ముందుకు సాగేవారు.

దీంతో అంతో ఇంతో అసంతృప్తి త‌గ్గింది.ఇది లైన్ అవుతున్న స‌మయంలో సోము ప‌గ్గాలు చేప‌ట్టారు.

ఈ కార‌ణంగా మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చేసింది.ఇప్పుడు గ్రూపులు పెరిగి పోయాయి.

"""/"/ మ‌రోవైపు తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీని గ‌ట్టెక్కించాల‌ని ఉన్నా టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

దీనికి త్వ‌ర‌గా తేల్చాల‌ని సోము ఇటీవ‌ల కేంద్రానికి లేఖ కూడా రాసిన‌ట్టు తెలిసింది.

ఇక, రైతుల చ‌ట్టాల‌పై పెల్లుబికిన అసంతృప్తిని త‌గ్గించ‌డంలోనూ సోము త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగ‌లేక పోయారు.

ఈ క్ర‌మంలోనే జీవీఎల్‌కు ఫోన్ చేసి రాష్ట్ర స్థాయి మీడియాకు ప్ర‌క‌ట‌న జారీ చేయించుకున్నారు.

మొత్తంగా చూస్తే సోము వ్యూహాత్మ‌కం అనేది లేకుండా సాగిస్తున్న వ్య‌వ‌హారంతో పార్టీ పుంజుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

రవితేజ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ వచ్చినట్టేనా..?