తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. భట్టి కామెంట్స్

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థనే అతాలకుతంల చేస్తోందని భట్టి ఆరోపించారు.

పాలకులే భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.50 శాతం ఉన్న జనాభాకు కేవలం ఐదు శాతమే బడ్జెట్ లో కేటాయిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో బలహీన వర్గాలను మరింత బలహీనపడేలా చేస్తున్నారన్నారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి నిత్యావసరాల ధరలను పెంచేసి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ భావజాలంతోనే సాధ్యమని తెలిపారు.

ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం… ఫాలోయింగ్ మామూలుగా లేదుగా?