నేపాల్ లో రాజకీయ దుమారం..!
TeluguStop.com
నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెర తీశాయి.
భారత్ - నేపాల్ వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రచండ మాట్లాడుతూ తాను ప్రధానమంత్రి కావడానికి సర్దార్ ప్రీతమ్ సింగ్ ఎంతగానో సహకరించారని తెలిపారు.
సర్దార్ ప్రీతమ్ సింగ్ తో కలిసి తాను పలుమార్లు ఢిల్లీ ప్రయాణించానన్నారు.అంతేకాకుండా ఖాట్మండ్ లోని రాజకీయ నేతలతో చర్చలు జరిపారని వెల్లడించారు.
అయితే ప్రధాని ప్రచండ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.ఈ క్రమంలోనే ప్రచండ రాజీనామాకు డిమాండ్ చేశారు.
ఢిల్లీ నియమించిన ప్రధానికి పదవిలో కొనసాగే అర్హత లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
రోజుకొక ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?