పోలియో చుక్కలు తప్పక వేయించాలి: ఎమ్మేల్యే మందుల సామెల్

సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరకి తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్( MLA Mandula Samuel ) అన్నారు.

ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ లో పోలియో చుక్కల( Polio Drops ) కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నపిల్లలకు వైద్య సిబ్బందితో కలిసి పోలియో చుక్కలు వేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది( Medical Staff ) పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ గుర్తించి 100% పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఆ ఇద్దరి స్టార్ హీరోలతో చేసిన స్నేహమే కొరటాల శివ తలరాతను మార్చేసిందా..?