పోలీసుల నిర్వాకంతో నవ్వుల‘పాలు’
TeluguStop.com
దొంగతనాలకు పాల్పడే దొంగలను పట్టుకుని వారి భరతం పట్టే పోలీసులే తప్పు దారి పడితే ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూశాం.
అయితే తాజాగా ఓ ఘటనలో పోలీసు దొంగతనానికి పాల్పడి ఖాకీల పరువు గంగలో కాదు పాలలో కలిపేశాడు.
ఇంతకీ ఈ పోలీసు ఏం చోరీ చేశాడో తెలిస్తే మీరు అవాక్కవ్వడం ఖాయం.
ఢిల్లీ సమీపంలోని నోయిడాలో రాత్రిపూగ పేట్రోలింగ్ చేసే పోలీసులు చోరీకి పాల్పడ్డారు.పేట్రోలింగ్ చేస్తు్న్న క్రమంలో ఓ దుకాణం ముందు పాల ప్యాకెట్ల ట్రేలు ఉండటంతో వాటిలో నుండి పాల ప్యాకెట్లను పోలీసు కానిస్టేబుల్ దొంగలించాడు.
ఈ తతంగం సీసీటీవీలో రికార్డు కావడంతో మనోడి బండారం బయటపడింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
పాల ప్యాకెట్లు దొంగలించిన కానిస్టేబుల్‌ను గుర్తించి, అతడిపై తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసుల పరువు తీశాడంటూ ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
50కి పైగా దెయ్యాల కొంపలకు వెళ్లిన యూకే ఘోస్ట్ హంటర్.. చివరికి..?