సెలబ్రిటీలైతే రూల్స్ బ్రేక్ చేస్తారా… అమితాబ్, అనుష్క శర్మకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!

సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా అది అభిమానులపై సాధారణ ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉంటుంది.

అందుకే సెలబ్రిటీలు ఏదైనా ఒక యాడ్ చేసినప్పుడు లేదా ఏవైనా పనులు చేసేటప్పుడు ప్రేక్షకులను అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది.

అయితే తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ), అనుష్క శర్మ( Anushka Sharma ) చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అనుష్క శర్మ అమితాబ్ ఇద్దరు కూడా సామాన్యుడి బైక్ పైప్రయాణం చేసిన సంగతి మనకు తెలిసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. """/" / ఇక అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ట్రాఫిక్ జామ్ కారణంగా షూటింగ్ కి ఆలస్యం అవుతుందన్న అమితాబ్ కారు దిగి సామాన్యుడు బైక్ పై షూటింగ్ లోకేషన్ కు చేరుకున్నారు.

ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అయితే ఇలా సెలబ్రిటీలు వారి హోదాని మరిచిపోయి సామాన్యులు బైక్ పై వెళ్లడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరి మాత్రం ఇక్కడ వారు హెల్మెట్( Helmet ) లేకుండా ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని గమనించి ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.

"""/" / ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తారా హెల్మెట్ లేని ప్రయాణం ఎంతో ప్రమాదకరం కదా అంటూ నేటిజన్స్ ముంబై పోలీసులను( Mumbai Police ) ట్యాగ్ చేశారు.

దీంతో పోలీసులు కూడా అమితాబ్, అనుష్క శర్మకు తమదైన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

నెటిజన్స్ చేసిన ఈ కామెంట్లపై పోలీసులు స్పందిస్తూ తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సెలబ్రిటీలు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఇది అభిమానులపై కూడా ప్రభావం చూపెడుతుందని అంతేకాకుండా ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలు జాగ్రత్తగా లేకుంటే.

ఫ్యాన్స్ లో చులకన అయ్యే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాలలో సెలబ్రిటీలో కాస్త ఆలోచించి వ్యవహరించడం ఎంతో మంచిది.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!