73శాతం పోలవరం పనులు పూర్తి చేసిన నాకు సందర్శన అనుమతి లేదా – చంద్రబాబు

ఏలూరు: పోలవరం సందర్శనకు పై అధికారులతో మాట్లాడి త్వరలో అనుమతిస్తామన్న పోలీసుల హామీతో నిరసన విరమించి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కామెంట్స్.పోలవరం సందర్శన కోసం రోడ్డుపై నిరసన తెలపాల్సి రావడం ఇదేం ఖర్మ రాష్ట్రానికి.

పోలవరం రివర్స్ టెండరింగ్ వద్దని మొత్తుకున్నా సైకో వినలేదు.5కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు.

73శాతం పోలవరం పనులు పూర్తి చేసిన నాకు సందర్శన అనుమతి లేదా.పోలవరం సందర్శన నాకు కొత్త కాదు.

28సార్లు పోలవరం వచ్చా, సోమవారాన్ని పోలవరం గా మార్చుకుని ముందుకు పోయా.పోలవరం కోసం నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేం.

నా జీవితంలో పోలవరం ముంపు గ్రామాలను, ప్రజలను మర్చిపోలేను.ఎంత ఖర్చయినా పునరావాస కాలనీలు నిర్మించాలని అనుకున్నా.

అధికారంలోకి రాగానే పోలవరంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి అన్ని సమస్యలు పరీష్కరిస్తా.ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం, యువతకో గంజాయి ఇచ్చి మత్తులో ముంచుతున్నాడు.

గుడి పూజారి ముసుగులో కామాంధుడు.. మహిళపై నీచంగా లైంగిక దాడి.. చివరకేం జరిగిందంటే?