రుషికొండకు సీపీఐ నేత.. అడ్డుకున్న పోలీసులు
TeluguStop.com
రుషికొండ సందర్శనకు వెళ్లిన సీపీఐ నేత నారాయణను పోలీసులు అడ్డుకున్నారు.రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతుందంటూ పరిశీలనకు వెళ్లారు.
ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.మరోవైపు రుషికొండ సందర్శనకు తమకు అనుమతి ఇప్పించాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
అనుమతి కోసం పర్యాటక అభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.అదేవిధంగా నారాయణ దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని టూరిజం కార్పొరేషన్ ను ధర్మాసనం ఆదేశించింది.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!