పోలీస్ ఎస్ఐ కావాలని ఆ మహిళ ప్రెగ్నెంట్ విషయాన్ని దాచి పెట్టి మరీ..?!

చాలా మందికి తమ కలను నెరవేర్చుకోవాలనే కసి ఉంటుంది.తమ గోల్స్ సాధించడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు.

అందుకోసం కష్టపడతారు.నేటి యువతలో పట్టుదల అనేది వారికి ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది.

చదువుకునే సమయంలో ఓ గోల్ ను పెట్టుకుంటారు.ఉద్యోగం కోసం రాత్రనకగా పగలనకా పట్టుదలతో ప్రిపేర్ అవుతారు.

ఎన్నో కిలోమీటర్లు నడిచైనా సరే తాము చేయాలనుకున్నది చేసి తీరుతారు.ఇటువంటి పట్టుదల అనేక మందిని ఉన్నత స్థానానికి చేరుస్తోంది.

తాజాగా ఓ మహిళ కూడా తాను అనుకున్నది సాధించింది.ఎన్నో రోజుల నుంచి ఆమె ఓ గోల్ ను పెట్టుకుంది.

తీరా అది సాధించేటప్పుడు ఓ సమస్య వచ్చి పడింది.అయినా సరే పట్టు వదలని విక్రమార్కునిలాగా ఆమె సాహసం చేసి తాను అనుకున్నది సాధించింది.

ఓ మహిళ ఆమె గర్భిణీ అనే విషయాన్ని దాచిపెట్టి మరీ మహిళా ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసింది.

ఫిజికల్ టెస్టు కోసం ఆమె గర్భిణీ అన్న సంగతి కూడా మర్చిపోయి టెస్టులో పాల్గొని సత్తా చాటింది.

400 మీటర్ల డిస్టన్స్ ను ఆమె కేవలం 1.36 మినిట్స్ లో రన్నింగ్ చేసి అర్హత సాధించింది.

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.అశ్విని సంతోష్ అనే మహిళా చిన్నతనం నుంచి ఎస్ఐ ఉద్యోగం సాధించాలని అనుకుంది.

ఆ ఉద్యోగం సాధించడం కోసం ఎన్నో రోజుల నుంచి శిక్షణ పొందుతోంది.పరీక్ష కోసం అనేక రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తోంది.

అయితే ఎస్ఐ ఉద్యోగం సాధించడానికి ఫిజికల్ టెస్టు చేసే టైంలో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది.

ఒకవైపు గర్భం మరోవైపు తాను అనుకున్న ఉద్యోగం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.చివరికి ఆమె తెగించి ఫిజికల్ టెస్టులో పాల్గొంది.

ఆమె గర్భవతి అన్న విషయం తెలుసుకున్న వారు మొదట ఆందోళన పడ్డారు.ఆ తర్వాత ఆమె పట్టుదలను చూసి అందరూ ప్రశంసలు కురిపించారు.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!