పోలీసులు క్షమాపణ చెప్పాలి: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలీసులు క్షమాపణ చెప్పాలని, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని తెలిసిందన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదని, ఇప్పుడు దేశాన్ని కూడా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రపంచశాంతి సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని, చివరి నిమిషంలో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నట్టు తెలిపారు.

పోలీసులు కూడా అధికార పార్టీ చెప్పుచేతల్లో పని చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలో పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

“యానిమల్” తెలుగు డబ్బింగ్ కోసం రాకేందు మౌళి ఎంత కష్టపడ్డాడో తెలుసా..