సాధారణ గంజాయి కన్న ఈ గంజాయికి ధర ఎక్కువ, ఎంతంటే?

సాధారణంగా గంజాయిని( Cannabis ) పొలంలోనో, తోటలోనో రహస్యంగా పండిస్తూ వుంటారు.

కానీ, దానిని ఏకంగా ఇంట్లో లేదా ఫ్లాట్‌లో పెంచడం గురించి ఎపుడైనా విన్నారా? విని వుండరు కదూ.

ఎందుకంటే ఆ సాహసం ఎవరూ చేయరు కాబట్టి.కానీ గుజరాత్‌లోని( Gujarat ) ఓ ఫ్లాట్‌లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందుకొని కదన రంగంలోకి దిగి నేరస్థులను పట్టుకున్నారు.

ఈ క్రమంలో ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.నిందితులు రెండు ఫ్లాట్లను అద్దెకు తీసుకుని బెడ్‌రూమ్‌లో గంజాయి సాగు ప్రారంబించినట్టు తెలిపారు.

"""/" / ఒక ఫ్లాట్‌లో గంజాయి సాగు కోసం శాస్త్రీయ పద్ధతిలో ప్రత్యేకంగా 'గ్రీన్‌రూమ్'( Green Room ) తయారు చేయడం కొసమెరుపు.

కాగా ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

వాళ్లు వచ్చి చూడగా.ఆ గదిలో గంజాయి చెట్లు కనిపించాయి.

నిందితులు ఈ గంజాయిని దేనికోసం పండించారు? ఎవరికి సరఫరా చేయనున్నారు? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"""/" / అహ్మదాబాద్‌లోని ఎస్.పి.

రింగ్ రోడ్‌లో గల 'యాపిల్‌వుడ్స్-ఆర్కిడ్ లెగసీ' అపార్ట్‌మెంట్స్‌లోని రెండు ఫ్లాట్లలో అనుమానాస్పద కార్యకలాపాలను ఇరుగు పొరుగువారు మొదట గమనించి ఆ నిందితులను మందలించడం జరిగింది.

కానీ బరితెగించిన ఆ కుర్రాళ్ళు వారి మాటలు పెడచెవిన పెట్టడం జరిగింది.దాంతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చేశారు.

ఇంకేముంది కట్ చేస్తే నిండుతులు పట్టుబడ్డారు.సాధారణంగా ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినప్పుడు, ఇంటి సామగ్రి తెచ్చుకుంటారు.

కానీ ఇక్కడ సరుకులు మాత్రమే రవాణా అయ్యేవి.నీటి జాడీలు, బకెట్లు, ప్లాస్టిక్ ట్యాంకులు తదితర వస్తువులు ఇక్కడికి వచ్చేవి.

దాంతో ఈ తంతు పోలీసులకు చేరింది.

వెన్నెల కిషోర్ తన ఇన్వెస్టిగేషన్ తో మెప్పించాడా? ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఎలావుందంటే..