కరీంనగర్ లో బీజేపీ సభకు పోలీసుల అనుమతి..!
TeluguStop.com
కరీంనగర్ జిల్లాలో ఈనెల 15న బీజేపీ సభను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతిని ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా సభను ఏర్పాటు చేయనున్నారు.ఈ మేరకు నిబంధనలతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని షరతులు విధించారు.కాగా ఈ భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు జేపీ నడ్డా, తరుణ్ చుగ్ లతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
వాల్‌మార్ట్‌లోని వస్తువులు నేలపై పడేస్తూ రచ్చ చేసిన బాలిక.. వీడియో చూస్తే షాకే..