వైరల్… సరస్సులో పడి మునిగిపోతున్న కుక్క… ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్ ఆఫీసర్

పోలీసులు హృదయం చాలా కఠినంగా ఉంటుందని సమాజంలో ఒక దృఢమైన అభిప్రాయం ఉంది.

కాని అది వందకు వంద శాతం తప్పు అని చాలా సార్లు రుజువైంది.

ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల్లో తమ వీరత్వంతో పోరాడి కఠిన పరిస్థితుల నుండి బయట పడేస్తారు.

వరదల్లో చిక్కుకున్నమూగ జీవాలను కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రజల మన్నలను పొందిన పోలీసులు ఎంతో మంది ఉన్నారు.

సరిగ్గా అటువంటి సంఘటనే మరొక్కసారి జరిగింది.మిచిగాన్ సరస్సులో పడి ప్రాణాలతో ఓ కుక్క పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తోంది.

సరిగ్గా అటువైపు వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ ఈ విషయాన్ని గమనించి చివరి క్షణంలో ప్రాణాలతో పోరాడుతున్న కుక్కను కాపాడిన ఆఫీసర్ కాపాడాడు.

ఆఫీసర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఆఫీసర్ పై వాట్ ఏ గ్రేట్ ఆఫీసర్, మేఎ లాంటి ఆఫీసర్ డిపార్ట్ మెంట్ లో ఉండడం గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

డ్రై హెయిర్ తో డోంట్ వర్రీ.. ఒక్క వాష్ తో రిపేర్ చేసుకోండిలా!