సమ్మర్ బరిలో గెలిచే పోలీస్ ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడో?

సమ్మర్ బరిలో గెలిచే పోలీస్ ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడో?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు పోలీస్ క్యారెక్టర్ లో( Police Characters ) నటించిన సినిమాలు ఇప్పటికే చాలా విడుదలైన విషయం తెలిసిందే.

సమ్మర్ బరిలో గెలిచే పోలీస్ ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడో?

ముఖ్యంగా కొంతమంది హీరోలకు పోలీస్ డైరెక్టర్లు బాగా సెట్ అయ్యాయని చెప్పవచ్చు.దానికి తోడు సరైన కథ దొరికితే చాలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు.

సమ్మర్ బరిలో గెలిచే పోలీస్ ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడో?

ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ఈ పోలీసు కథల జోరు బాగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఈ వేసవికి బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడుతున్న హీరోల్లో పలువురు పోలీసు పాత్రలతోనే అలరించేందుకు సిద్ధమవుతుండటం అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది.

ఇంతకీ ఆ సినిమాలు ఏవి ఆ హీరోలు ఎవరు అన్న విషయానికి వస్తే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోలీస్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యే హీరోలలో రవితేజ( Ravi Teja ) కూడా ఒకరు.

పోలీసు కథలకు రవితేజ చిరునామాగా నిలుస్తూ ఉంటారు.ఇప్పటికే చాలా సినిమాలలో పోలీస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు రవితేజ.

ఇప్పుడు మాస్ జాతర( Mass Jathara Movie ) అనే సినిమాలో కూడా పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

"""/" / మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో రైల్వే పోలీసుగా లక్ష్మణ్‌ భేరి అనే పాత్రలో అలరించనున్నారు రవితేజ.

ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది.

పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్న మరొక హీరో నాని.( Hero Nani ) హిట్‌: ది థర్డ్‌ కేస్‌( Hit: The Third Case ) సినిమాలో పోలీసు పాత్రలో అభిమానును పలకరించేందుకు సమాయత్తమవుతున్నారు.

తన హిట్‌ ఫ్రాంఛైజీలో భాగంగా శైలేశ్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో అర్జున్‌ సర్కార్‌ అనే శక్తిమంతమైన పోలీసుగా కనువిందు చేయనున్నారు నాని.

ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

"""/" / ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తొలి భాగం చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది.

ఇది మేలో బాక్సాఫీస్‌ ముందుకు రానున్నట్లు తెలిస్తోంది.అలాగే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,( Bellamkonda Saisrinivas ) సాగర్ చంద్ర కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం టైసన్ నాయుడు( Tyson Naidu Movie ) ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ క్యారెక్టర్ లో నటించారట.

ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.మరి ఈ హీరోలలో సమ్మర్ బరిలో గెలిచేది ఎవరో చూడాలి మరి.

రాజేంద్ర  ప్రసాద్ గొప్ప నటుడు ఏం కాదు… దుమారం రేపుతున్న నటుడు నరేష్ కామెంట్స్!

రాజేంద్ర  ప్రసాద్ గొప్ప నటుడు ఏం కాదు… దుమారం రేపుతున్న నటుడు నరేష్ కామెంట్స్!