ఉగ్రవాదుల లింకులపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ ఉగ్రవాదుల లింకులపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.డార్క్ వెబ్, రాకెట్ చాట్, తీమ్రాయాప్ ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు.

టార్గెట్ హైదరాబాద్ మాడ్యుల్ అంతా సలీం నేతృత్వంలోనే సాగినట్లు పోలీసులు నిర్ధారించారు.మూడు దఫాలుగా హైదరాబాద్ మాడ్యుల్ ప్లాన్ వేసినట్లు తెలిపారు.

భూపాల్ నుంచి యాసిర్ ఇచ్చిన ఆదేశాలతో ప్లాన్ ను సలీం హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ - భూపాల్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

12 మంది భూపాల్ వాసులు, ఐదుగురు హైదరాబాదీలకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!