దేవరకొండ కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన దేవరకొండ కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ ఘటనలో ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఉమాపతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.బుక్కరాయసముద్రం దేవరకొండపై ఉన్న ఆలయానికి దర్శనానికి ఉమాపతి ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తన పాత విద్యార్థి కారును తీసుకోని డ్రైవర్ తో పాటు దర్శనానికి వెళ్లారు.

అయితే గుడి మూసి ఉండటంతో బయట నుంచే దండం పెట్టుకున్నారు.అనంతరం ఫోన్ మాట్లాడాలని చెప్పడంతో డ్రైవర్ ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలోనే కారు కదిలి కింద పడింది.అయితే కారులో ఉమాపతి కాలిన గాయాలతో మృతిచెందినట్లు గుర్తించారు.

దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశ్వం మూవీ ట్రైలర్ రివ్యూ.. డైరెక్టర్ శ్రీనువైట్ల ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?