సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై రాయి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

కేసులో ఏ2 గా ఉన్న దుర్గారావును( Durga Rao ) పోలీసులు కోర్టులో హజరుపరచలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో నిందితుడు దుర్గారావు ఎక్కడ ఉన్నాడనే దానిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కేసులో ఏ1గా ఉన్న సతీశ్( Satish ) ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దుర్గారావును పోలీసులు కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు దుర్గారావే సీఎం జగన్ పై హత్యాయత్నానికి ప్రేరేపించాడా? లేక ఎవరైనా ప్రేరేపిస్తే హత్యాయత్నానికి పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు క్లారిటీ ఇదే.. ఆ రెండు పండుగలే టార్గెట్ అంటూ?