ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ కేసులో రాధాకిషన్ రావు( Radhakishen Rao ) వాంగ్మూలం కీలకంగా మారింది.

నలుగురు కీలక నేతల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహారించినట్లు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.

తన మిత్రుడైన ఎమ్మెల్సీకి ఎన్నికల్లో ఆయన సహాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాల్లో డబ్బులు రవాణా చేసినట్లు నిర్ధారించారు.

సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐతో( Central Zone Task Force With SI ) డబ్బులు రవాణా చేయించినట్లు నిర్ధారించిన పోలీసులు పలు దఫాల్లో రూ.

4 కోట్లు తరలించినట్లు చెప్పారు.ఈ క్రమంలోనే డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.

అటు ప్రభాకర్ రావు( Prabhakar Rao ) ఆదేశాలతో రాజకీయ నేతలపై రాధాకిషన్ రావు నిఘా పెట్టారు.

అనంతరం నిఘా సమాచారాన్ని ప్రభాకర్ రావుకు రాధాకిషన్ రావు చేరవేశారు.రాధాకిషన్ రావుకు సహకరించిన ఎస్ఐలను, మాజీ పోలీస్ అధికారులను పోలీసులు విచారించనున్నారు.

ఈ దర్శకులకు ఏమైంది ఎందుకు సినిమాలు చేయడం లేదు…