ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఫర్టిలైజర్ షాపులను పోలీసులు తనిఖీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం రాష్ట్రంలోని పోలీస్ శాఖకు ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయాలని ఆదేశించగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివిధ మండలాల పోలీసులకు ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా ఎల్లారెడ్డిపేట మండల పోలీసులు గ్రూపులుగా వెళ్లి మండలంలోని ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేసి షాపు యజమానులకు తెలియజేస్తూ.

రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందజేయాలని లేనియెడల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపి రికార్డులను పరిశీలించారు.

బొప్పాపూర్ గొల్లపల్లి లోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన వారిలో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, పి.

సి సాదుర్ల సతీష్ ఉన్నారు.

మరోసారి పెళ్ళిచేసుకున్న శృంగార తార