విదేశాల్లో వేధింపుల కేసు.. భారత్‌లో విచారణ : పంజాబ్ – హర్యానా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

అభాగ్యులకు అండగా నిలిచేందుకు, న్యాయం చేసేందుకు తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, గృహ హింస సహా కొన్ని రకాల చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

ఇందులోని లొసుగులను అడ్డుపెట్టుకుని కొందరు కక్ష సాధింపులకు దిగుతున్నారని పలుమార్లు పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి.

ఈ చట్టాలను సమీక్షించి కొన్ని సవరణలు చేయాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అయినప్పటికీ కొందరు ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రతీకార చర్యలకు దిగుతున్నారు.

"""/" / ఈ నేపథ్యంలో ఓ కుటుంబంపై వచ్చిన వరకట్న వేధింపుల కేసుపై విచారణ సందర్భంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

విదేశాలలో వేధింపులకు గురైన సంఘటనలపై దర్యాప్తు చేసే అధికారం భారతదేశం( India )లోని పోలీసులకు లేదని న్యాయస్థానం పేర్కొంది.

సీఆర్‌పీసీ సెక్షన్ 188 ప్రకారం భారతదేశానికి వెలుపల నేరం జరిగినట్లుగా ఆరోపించబడిన కేసులలో ఇండియాలో క్రిమినల్ ప్రాసిక్యూషన్‌( Criminal Proceedings )కు కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిరి అనుమతి అవసరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హర్‌ప్రీత్ సింగ్ బ్రార్( Harpreet Singh Brar ) స్పష్టం చేశారు.

"""/" / ఆరోపించిన నేరంపై విచారణకు దర్యాప్తు ఏజెన్సీని నిమగ్నం చేయడానికి ప్రాదేశిక అధికార పరిధిని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి తెలిపారు.

అది విఫలమైతే ఎఫ్ఐఆర్ కొనసాగించబడదన్నారు.భటిండా జిల్లాలోని ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్‌లో మార్చి 2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆర్ఎస్ బజాజ్, సిదక్‌జిత్ సింగ్ బజాజ్, సచిన్ కాలియాలు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కేవలం పిటిషనర్‌లపై తన వ్యక్తిగత పగ తీర్చుకోవడం కోసమే ఎఫ్ఐఆర్ ద్వారా ప్రతివాది భార్య భారతదేశంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించినట్లుగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఇది నిస్సందేహాంగా క్షమించరాని నేరమని చెబుతూ ఎఫ్ఐఆర్ సహా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

పావురాలను ఉపయోగించి 50 ఇళ్లను దోచుకున్న దొంగ..