నల్లగొండలో ఆకతాయిలపై పోలీసు వేట

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు ఆకతాయిలు రాత్రివేళ తాగి బైక్స్ నడుపుతూ,గుంపులుగా కూర్చొని న్యూసెన్స్ చేస్తున్నారని కాలనీ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి రైడ్ చేసి ఆకతాయిల ఆట కట్టించారు.

20 మందిని అదుపులోకి తీసుకుని తెల్లారి పేరెంట్స్ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా 5 డిడి కేసులు,11 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

మళ్లీ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే జైల్ శిక్ష తప్పదన్నారు.తాగి బైక్ నడిపినా,ట్రిపుల్ రైడింగ్ చేసినా,రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినా మైనర్లకు వాహనాలు ఇచ్చినా, రాత్రివేళల్లో గుంపులుగా కూర్చొని న్యూసెన్స్ చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?