రంగారెడ్డి జిల్లాలో యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల వేట

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో సీసీ టీపీ పుటేజ్ ను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

నవీన్ రెడ్డి, అతని గ్యాంగ్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.కాగా బ్యాడ్మింటర్ అకాడమీలో గతేడాది నవీన్ రెడ్డికి, యువతికి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ప్రేమిస్తున్నానని నవీన్ రెడ్డి చెప్పగా యువతి తల్లిదండ్రులు తిరస్కరించారు.అయితే యువతిని పెళ్లి చేసుకుంటానని మధ్యవర్తులతో మాట్లాడించిన నవీన్ రెడ్డి అది కూడా బెడిసి కొట్టడంతో బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.ఇవాళ యువతికి పెళ్లి చూపులని తెలుసుకున్న నవీన్ రెడ్డి కొందరు దుండగులతో దాడులు చేయించి యువతిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

క్లిక్ పూర్తిగా చదవండి

రౌడీ స్టార్‌ కి దెబ్బ మీద దెబ్బ.. ఈయన మళ్లీ కోలుకుంటాడా? లేదా?

అభ్యంతరాలుంటే ప్రభుత్వంతో చర్చించాలి.. బీఆర్ఎస్ ఎంపీ కేకే

కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఎమ్మెల్యే రాజాసింగ్‎కు మరోసారి పోలీసుల నోటీసులు..!

ఆవుపేడతో కార్లకోసం గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న మారుతీ సుజుకీ!