ఏపీ ఎన్నికల నిర్వహణలో పోలీసులు ఫెయిల్ ..: మంత్రి అంబటి

ఏపీలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు అందింది.

ఈ మేరకు టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే డీజీపీని కలిసిన అంబటి రాంబాబు,( Ambati Rambabu ) పేర్ని నాని, జోగి రమేశ్ ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.పోలీసు అధికారుల వైఫల్యం వలనే దాడులు జరిగాయన్న ఆయన అధికారులను మార్చిన తరువాత కూడా ఎందుకు దాడులు జరిగాయని ప్రశ్నించారు.

టీడీపీ అనుకూల ప్రాంతాల్లో పోలీసులను పెట్టలేదన్నారు.పల్నాడులో( Palnadu ) పోలీసులు టీడీపీతో( TDP ) కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

ఆరు బూతుల్లో రీ పోలింగ్ అడిగామన్న ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు.వెబ్ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే రిగ్గింగ్ జరిగిందని తెలుస్తుందన్నారు.

తమను హౌస్ అరెస్ట్ చేశారని, టీడీపీ వాళ్లను మాత్రం తిరగనిచ్చారంటూ ధ్వజమెత్తారు.అధికారులను మార్చిన తరువాతే గొడవలు జరిగాయని ఆరోపించారు.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!