జిల్లా వ్యాప్తంగా డైలీ ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District)లో అనుమతులు లేకుండా డైలీ ఫైనాన్స్ ( Daily Finance)నిర్వహిస్తు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డైలీ ఫైనాన్స్ వ్యాపారస్తులు పై శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని, డైలీ ఫైనాన్స్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేస్తూ, అట్టి అధిక వడ్డీలు ( High Interest Rates)చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, చట్ట విరుద్ధంగా,అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలు ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని, అలాగే స్థానిక పోలీసు వారికి ,డయల్100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.

హీరో నాని ఇంట్రడ్యూస్ చేసిన 10 మంది టాలెంటెడ్ డైరెక్టర్లు.. ఎవరంటే..?