కోదాడలో హిజ్రాలకు పోలీస్ కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పరిధిలోని హిజ్రాలు ప్రజలు జరుపుకునే వివాహాది శుభ కార్యాలయాలు,నూతన గృహప్రవేశాలు,వాణిజ్య సముదాయాల,ఓపెనింగ్లు ఇతర ఫంక్షన్ల వద్దకు వెళ్లి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు.

కోదాడ పరిధిలోని హిజ్రాలను పోలీస్ స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ పరిధిలో ఉండే హిజ్రాలు శుభకార్యాల వద్దకు వెళ్లి వారిని ఇబ్బందులు గురిచేసినట్లు మాకు ఫిర్యాదు అందినా సదరు హిజ్రాలపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని, అలాగే రోడ్లమీద వాహనదారులకు ఆపి డబ్బులు అడిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అమ్మాయిల అందాన్ని పెంచే పొద్దుతిరుగుడు.. ఎలా వాడాలంటే..?